News & Updates
President’s Message
Parameswara Reddy Nangi
President
మీ ప్రోత్సాహానికి, సహకారానికి నా కృతజ్ఞతలు…
మీ ఆదరాభిమానాలకు, ప్రోత్సాహానికి, మరియు సహాయసహకారాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు…
“సమాజ సేవలో తమను తాము మరిచిపోయేవారే అత్యంత సంతోషకరమైన వ్యక్తులు.”
ఇతరుల సేవలో మనం తరించినప్పుడే, మన స్వంత జీవితాన్ని మరియు మన స్వంత ఆనందాన్ని మనం కనుగొంటాము
మీ మిత్రుడు, శ్రేయోభిలాషి మన ఆస్టిన్ నగర తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు పరమేశ్వర రెడ్డి నంగి, ఆస్టిన్ మరియు పరిసర ప్రాంత తెలుగు వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ నా తరపున, మా కార్యవర్గ సభ్యుల తరుపున నూతన ఆంగ్ల మరియు తెలుగు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు.
2024 సంవత్సరం అందరికీ సంతోషకరమైన మరియు సంపన్నమైన శుభ సంవత్సరం కావాలని మనసారా కోరుకుంటున్నాను.
నా మీద ఎంతో నమ్మకంతో 2024 సంవత్సరం ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన మా కార్యవర్గ సభ్యులకు (EC), ధర్మకర్తల మండలికి (BOD), నాకు అడుగడుగునా సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తున్న దాతలకు, మిత్రులకు మరియు స్వచ్చందంగా ముందుకొచ్చి సేవలందిస్తున్న అందరికీ నా మనః పూర్వక కృతజ్ఞతలు.
నూతన సంవత్సరం సరికొత్త ఆలోచనలతో మరిన్ని వినూత్నమైన అలరారించే కార్యక్రమాలతో 2024 ఒక చిరస్మరణీయమైన సంవత్సరముగా ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక కార్యవర్గ సభ్యులు కలిసి కట్టుగా కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను.
ప్రతిష్టాత్మకమైన మన ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం నిరంతరం మన తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలని ప్రోత్సాహిస్తూ భావితరానికి మార్గదర్శిగా స్పూర్తినిచ్చే దిశగా అడుగులేస్తూ 32 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది, ఇందుకు ప్రధాన కారకులయిన నాయకులకి, దాతలకి, స్వచ్ఛందంగా సేవలందిస్తున్న కార్యకర్తలందరికీ నా శుభాభినందనలు.
ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహించే కార్యకలాపాల్లో ఎల్లప్పుడూ మహిళా శక్తికి, సాధికారికతకు పెద్ద పీట వేస్తూనే వుంది. ప్రతి సంవత్సరం లాగానే 2024 మహిళా దినోత్సవం లో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసిన మహిళామణులందరికీ శుభాభినందనలు. అదే పరంపరను కొనసాగిస్తూ, ఆస్టిన్ తెలుగు మహిళలందరూ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని మరియు చేయూత నివ్వాలని విజ్ఞప్తి.
ఆస్టిన్ యువ శక్తి స్థానిక ప్రతిభను గుర్తిస్తూ, వారే మన సంస్కృతికి వారసులని భావిస్తూ వారికి అన్నివేళల మన కార్యక్రమాలలో అవకాశం కల్పిస్తూ ప్రోత్సహించటంలో ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. ఈ సందర్భంగా యువతీ యువకులు అందరూ ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం చేపట్టిన వివిధ కార్యకలాపాల్లో మరింత చురుగ్గా పాల్గొంటూ విజయవంతం చేయాలని కోరుకొంటున్నాము.
సంక్రాంతి, మహిళా దినోత్సవం, ఉగాది, శ్రీరామనవమి, స్వాతంత్ర దినోత్సవం, దసరా మరియు దీపావళి వంటి మా ప్రధాన వార్షిక వేడుకల తో పాటు, అందరు తెలుగు వారికి మరింత చేరువకావాలని మరియు మన ప్రభావాన్ని విస్తరించడానికి మేము అద్భుతమైన ప్రణాళికలను కలిగి ఉన్నాము.
మా ప్రణాళికలో మచ్చుకి కొన్ని కార్యక్రమాల వివరాలు:
1. యువజన సంఘాల ఏర్పాటు
2. రోబోటిక్స్ పరిచయాలపై వెబినార్లు
3. మిల్లెట్లతో ఆరోగ్యకరమైన జీవనం
4. SAT పరీక్షపై అవగాహన
5. A big NO for the GO Fund వెబినార్లు
6. ఉచిత వైద్య అవగాహన శిబిరాలు
7. ఫుడ్ డ్రైవ్‌లు
8. రక్తదాన శిబిరాలు
9. TCA 5K రన్:
10. Texas School for the Blind & Visually Impaired కోసం నిధుల సేకరణ
11. ఇతర స్వచ్ఛంద కార్యక్రమాలు
మీ అందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడిగా తెలుగు భాషకి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు మరియు మరెన్నో వినూత్న కార్యక్రమాలతో ఆస్టిన్ తెలుగు వారందరిని అలరించి, ఆనందింప చేస్తానని, తెలుగు సాంస్కృతిక సంఘం అభివృద్ధికి నా వంతు ప్రయత్నం, కృషి చేస్తానని మాట ఇస్తున్నాను.
భవదీయుడు,
పరమేశ్వర రెడ్డి నంగి
అధ్యక్షులు
తెలుగు సాంస్కృతిక సంఘం
ఆస్టిన్ ,టెక్సస్.